ఓటింగ్‌కు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

17 Feb, 2020 05:56 IST|Sakshi

మద్రాసు ఐఐటీతో ఈసీ ఒప్పందం

బనశంకరి (బెంగళూరు): దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది.  ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక ఇంటర్నెట్‌ లైన్ల ద్వారా వెబ్‌ కెమెరా, ఓటరు వేలిముద్రలను ఉపయోగించుకొని ఓటరును నిర్ధారించుకుంటారు. అనంతరం టూ వే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ ద్వారా ఓటును ఎన్‌క్రిప్ట్‌ చేస్తారు. అనంతరం తిరిగి ఎన్నికలప్పుడే డీక్రిప్ట్‌ చేసేలా చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు చెన్నైకి చెందిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే అధికారులు ఏర్పాటు చేసిన అధీకృత సెంటర్‌ ద్వారా చైన్నైలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. దీనికి ఈ–బాలెట్‌ పేపర్‌ జనరేట్‌ అవుతుందని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా