ఎంపీ మిసా భారతికి ఈడీ సమన్లు

10 Jul, 2017 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా లాలూ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మిసా భారతికి సోమవారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సమన్లు జారీ చేసింది.  మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆమెను ఈడీ ఆదేశించింది. అలాగే ఢిల్లీలోని మిసా ఫాంహౌస్‌ను ఈడీ అటాచ్‌ చేసే యోచనలో ఉంది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి రెండో రోజుల క్రితం  ఆమె నివాసంతో పాటు ఫాంహౌస్‌లో ఈడీ ఇప్పటికే  సోదాలు చేసిన విషయం తెలిసిందే.

మిసా, ఆమె భర్త బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని భావిస్తున్న ఈడీ అధికారులు.. గత నెలలో వారిని విచారించారు. తాజాగా మరోసారి విచారణ పట్టిన అధికారులు.. ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లతో పాటు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, ఫోన్లు కూడా సీజ్‌ చేశారు. మరోవైపు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టి, కేసులు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు