రూపాయి పతనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు

9 Jul, 2013 20:33 IST|Sakshi

ముంబై: డాలర్ మారకం విలువలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు  రిజర్వ్‌ బ్యాంకు పలు రకాల చర్యలు చేపడుతోంది. బ్యాంకులు, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో నిర్వహించే లావాదేవీలపై ఆంక్షలు విధించింది. బ్యాంకులు ఈ విభాగంలో క్లయింట్ల
తరఫున ఇకపై లావాదేవీలు జరపకూడదని ఆర్‌బీఐ నిర్దేశించింది. తమ అవసరాలకు మాత్రమే ఎఫ్ అండ్ ఓలో చర్యలు చేపట్టాలని సూచించింది.

అయితే ఆర్‌బీఐ తీసుకునే చర్యలతో రూపాయి పతనం ఆగకపోవచ్చని విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు. ఒక డాలర్‌ కోసం 70 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితులు కూడా రావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు రూపాయి కొంత కోలుకుంది.
36 పైసలు లాభపడి 60 రూపాయిల 25 పైసల వద్ద ట్రేడయింది.

మరిన్ని వార్తలు