'భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తుంది'

2 Apr, 2015 04:23 IST|Sakshi

భూసేకరణ బిల్లుపై విపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్రం వివిధ పార్టీలకు నచ్చజెప్పే పనిలో పడింది. ఆయా పార్టీల సూచనలను బిల్లులో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈ విషయంలో ఏకాభిప్రాయం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు.

సీనియర్ మంత్రులందరూ రాజకీయ పార్టీలకు నచ్చజెప్పే పనిలో ఉన్నారని బుధవారంతెలిపారు.  మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారకం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో రాజకీయమేమీ లేదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించగానే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపడతామని తెలిపారు. ఆయన బుధవారం స్వీడన్ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అన్నా జాన్సన్ బృందంతో భేటీ అయ్యారు.
 

మరిన్ని వార్తలు