రాజకీయ పార్టీలకు ఈసీఐ కొత్త మార్గదర్శకాలు

8 Oct, 2016 20:01 IST|Sakshi

ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) శనివారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వ నిధులను పార్టీ పనులకు వినియోగించొద్దని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ స్థలాలను రాజకీయ అవసరాలకు వినియోగించుకోవద్దని పార్టీలకు సూచించింది. కామన్ కాస్ వర్సెస్ బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఎన్నికల కమిషన్ ను కొన్ని వివరాలపై స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈసీఐ ఈ విషయాలను వెల్లడించింది. ప్రభుత్వ స్థలాలలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల సొమ్మును పార్టీకి ఖర్చు చేయడం, ఎన్నికల గుర్తులు వినియోగించకూడదని పేర్కొంది. లేనిపక్షంలో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లేనని వివరించింది.

మరిన్ని వార్తలు