ముంబైలో అగ్నిప్రమాదం: 8 మంది సజీవదహనం

30 Jun, 2016 09:20 IST|Sakshi

ముంబై: ముంబై మహానగరంలోని విషాదం చోటు చేసుకుంది. నగర శివారు అంథేరిలోని చావ్లలోని మందుల దుకాణంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఎనిమిది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అగ్నిప్రమాదం వల్ల ముందుల దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలిడం వల్ల ఎనిమిది మంది మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అందులోభాగంగా స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు