పట్టాలెక్కిన రైళ్లు.. తొలిరోజు..

13 May, 2020 09:23 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో దాదాపు నెలల విరామం తర్వాత ప్రయాణికుల రైళ్లు మంగళవారం పట్టాలెక్కాయి. ఎనిమిది రాజధాని ఎయిర్‌కండిషన్డ్‌ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలు దేరాయి. మొదటి రోజు 8,121 మంది ప్రయాణికులతో రైళ్లు బయలుదేరినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (రైలు బండి.. షరతులు ఇవేనండీ)

బిలాస్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌), దిబబ్రూగఢ్‌(అసోం), బెంగళూరు (కర్ణాటక) నుంచి మూడు రైళ్లు బయలు దేరాయి. దేశరాజధాని ఢిల్లీ నుంచి హౌరా(పశ్చిమ బెంగాల్‌), రాజేంద్రనగర్‌(బిహార్‌), ముంబై సెంట్రల్‌(మహారాష్ట్ర), అహ్మదాబాద్‌(గుజరాత్‌), బెంగళూరు నగరాలకు మరో ఐదు రైళ్లు వెళ్లాయి. ‘కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పునరుద్ధరణ తర్వాత న్యూఢిల్లీ-బిలాస్‌పూర్‌ రాజధాని సూపర్‌ఫాస్ట్‌ రైలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి రైలు’ అని రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఈ రైలు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు బిలాస్‌పూర్‌కు బయలుదేరింది. 

కాగా, సోమవారం సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలను రైల్వే శాఖ ప్రారంభించింది. 24 గంటల్లో 1,69,039 టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. ఏడు రోజుల ముందువరకు మాత్రమే ఆన్‌లైన​ బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. మొట్టమొదటగా 15 మార్గాల్లో 15 జతల (30 రానుపోను ప్రయాణాలు) రైళ్లను ప్రారంభించారు. ఇతర రెగ్యులర్‌ ప్యాసింజర్‌ సర్వీసెస్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబ్‌ అర్బన్‌ సర్వీసులను ఇంకా ప్రారంభం కాలేదు. (లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం)

Poll
Loading...
మరిన్ని వార్తలు