బీఫ్ బ్యాన్ కోసం ఎనిమిదిమంది ఆత్మహత్యాయత్నం

17 Mar, 2016 21:18 IST|Sakshi
బీఫ్ బ్యాన్ కోసం ఎనిమిదిమంది ఆత్మహత్యాయత్నం

అహ్మదాబాద్ః గోమాంసాన్ని నిషేధించాలంటూ గుజరాత్ లో మళ్ళీ ఆందోళన మొదలైంది. రాజ్ కోట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎనిమిదిమంది యువకులు ఢిల్లీలో జరుగుతున్న బీఫ్ బ్యాన్ డిమాండ్ దీక్షకు మద్దతుగా పత్తి పొలాలకు వేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆప్రమత్తమైన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

గుజరాత్ లోని గోరక్ష ఏక్తా సమితికి చెందిన సుమారు  50 మంది కార్యకర్తలు మధ్యాహ్నం 12.15 నిమిషాల ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వారి డిమాండ్ కు మద్దతుగా నినాదాలు ప్రారంభించారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఘటనాస్థలంలో పోలీసులు మొహరించారు. దీంతో ప్రదర్శనకు రాజ్ కోట్ వచ్చిన నిరసనకారుల్లోని సౌరాష్ట్ర గూచీ, గోండాల్, థంగాధ్, జామ్నగర్, లింబ్డి ప్రాంతాల్లోని ఎనిమిదిమంది యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ప్రదర్శనకు వచ్చిన యువత ఆస్పత్రిపాలయ్యారన్నవార్తతో గో రక్షణ ప్రచార మద్దతుదారులు సౌరాష్ట్ర ప్రాంతంలో నిరసనలకు దిగారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై ట్రాఫిక్ స్తంభింపజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.  రాజ్ కోట్ గ్రీన్ ల్యాండ్ క్రాసింగ్ సమీపంలో ట్రాఫిక్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా రాజ్ కోట్ లో ప్రదర్శన నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు