నేడు మమత ప్రమాణం

27 May, 2016 07:02 IST|Sakshi
గురువారం కోల్కతాలో గవర్నర్ను కలసి బయటికొచ్చిన సందర్భంగా మమతా బెనర్జీ

బెంగాల్ కేబినెట్‌లో 41 మందికి చోటు
కోల్‌కతా: నేడు పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మమతా బెనర్జీ గురువారం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి మంత్రులుగా ప్రమాణం చేసే ఎమ్మెల్యేల జాబితాను అందచేశారు. 41 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తుండగా వారిలో 17 మంది కొత్తగా ఎన్నికైనవారు. నేడు తనతోపాటు మొత్తం 42 మంది ప్రమాణస్వీకారం చేస్తారని గవర్నర్‌తో భేటీ అనంతరం మమత తెలిపారు.
 
కేబినెట్‌లో కొత్తగా మాజీ క్రికెట్ లక్ష్మీ రతన్ శుక్లా, కోల్‌కతా మేయర్ శోవన్ ఛటర్జీ, గాయకుడు ఇంద్రనీల్ సేన్ తదితరుల్ని చేర్చుకుంటున్నామని తెలిపారు. ప్రమాణస్వీకారానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రి, భూటాన్ ప్రధాని, ఢిల్లీ, యూపీ సీఎంలు కేజ్రీవాల్, అఖిలేష్, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాలు హాజరవుతున్నారని మమత చెప్పారు. మమతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జందానీ చీర, 20 కిలోల హిల్షా చేప, మొలాసెస్‌ను కానుకగా ఇవ్వనుంది. నేడు ఆ దేశ మంత్రి ప్రమాణస్వీకారోత్సవంలో వీటిని మమతకు అందచేస్తారు. అయితే ప్రమాణస్వీకారానికి హాజరుకావడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది.

>
మరిన్ని వార్తలు