రోజూవారీ ప్రచార వ్యయం కుదింపు

26 Nov, 2018 10:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మితిమీరిన నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. ప్రచారం నిమిత్తం అభ్యర్థి రోజుకు జరిపే నగదు లావాదేవీలను రూ.20 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.10 వేల పరిమితి దాటి కూడా ఖర్చు చేయాల్సి వస్తే, ఆ లావాదేవీలను అభ్యర్థి ఖాతా నుంచి చెక్కులు, డ్రాఫ్టులు, నెఫ్ట్‌/ఆర్‌టీజీఎస్‌ రూపంలో నిర్వహించాలని ఈసీ సూచించింది.

నవంబర్‌ 12నే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ప్రచార సమయంలో అభ్యర్థి ఎవరైనా వ్యక్తి, సంస్థ నుంచి నగదు రూపంలో రూ.10 వేలకు మించి విరాళాలు, రుణాలు స్వీకరించరాదు.

మరిన్ని వార్తలు