దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు వాయిదా

23 Jul, 2020 14:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా వైరస్‌, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప​ ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఉప ఎన్నికలు సెప్టెంబర్‌ 7 వరకు నిర్వహించాల్సింది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.

మరిన్ని వార్తలు