‘రెండాకులు’ ఎవరివో తేలేది ఆరోజే..

22 Sep, 2017 17:00 IST|Sakshi
‘రెండాకులు’ ఎవరివో తేలేది ఆరోజే..
సాక్షి,న్యూఢిల్లీః ఏఐఏడీఎంకే ఎన్నికల చిహ్నం రెండాకులపై పార్టీలో రెండు చీలిక వర్గాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో అక్టోబర్‌ 5న దీనిపై ఎన్నికల కమిషన్‌ విచారించనుంది.దీనిపై ఈనెల 29లోగా తాజాగా తమ క్లెయిమ్‌ను సమర్ధించే పత్రాలను సమర్పించాలని ఈసీ ఇరు వర్గాలను కోరింది. డిసెంబర్‌ 5, 2016 నాటికి పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు, కేంద్ర కార్యనిర్వాహక సభ్యుల వివరాలను సమర్పించాలని ఇరు వర్గాలను కోరింది. పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం తమకే చెందాలంటూ ఇరు పక్షాలు ఇప్పటికే పెద్దసంఖ్యలో అఫిడవిట్లు సమర్పించాయి.
 
అక్టోబర్‌ 5న ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్టు ఈసీ వర్గాలు ప్రకటించాయి. ఓ పన్నీర్‌సెల్వం, వీకే శశికళ నేతృత్వంలోని పార్టీ వర్గాలు ఎన్నికల గుర్తు తమకే చెందాలంటూ ఈసీని ఆశ్రయించిన విషయం విదితమే.అనంతరం జరిగిన పరిణామాల్లో సీఎం పళనిస్వామి నేతృత్వంలో పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు శశికళ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు.
మరిన్ని వార్తలు