ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

4 Oct, 2013 17:03 IST|Sakshi

ఐదు రాష్ట్రాలకు శాసన ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. చత్తీస్గడ్లో నవంబర్ 11, 19న, మధ్యప్రదేశ్లో నవంబర్ 25న, రాజస్థాన్లో డిసెంబర్ 1న, మిజోరాం, ఢిల్లీల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. చత్తీస్గడ్లో రెండు దశల్లో ఎన్నికల్ని నిర్వహిస్తుండగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పూర్తి చేస్తారు.

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం లక్షా 30 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా రానున్నఎన్నికల ఫలితాలు బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చని పలు సర్వేలు ఇటీవల వెల్లడించాయి.

మరిన్ని వార్తలు