అక్టోబర్‌ 15న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక

18 Apr, 2017 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్టీ అంతర్గత ఎన్నికలతోపాటు అధ్యక్ష స్థానానికి ఎన్నికలను అక్టోబర్‌ 15న నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ ఎన్నికలను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సమయంలో అంతకుముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

సెప్టెంబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 15 వరకు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ చైర్మన్‌ ముల్లపల్లి రామచంద్రన్‌ తెలిపారు. అంతకుముందే పీసీసీల కమిటీలు, అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యుల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇటీవలి ఫలితాల నేపథ్యంలో పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరణ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌కు అప్పచెప్పడంపై పార్టీలో స్పష్టత లేనప్పటికీ.. పలువురు సీనియర్‌ నేతలు మాత్రం యువరాజే బాధ్యతలు తీసుకోవాలంటున్నారు.

మరిన్ని వార్తలు