వైరల్‌: ‘ఉత్తమమైన దొంగతనం.. అద్భుతం’

25 May, 2020 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ ఏనుగు పిల్ల చెట్టెక్కి పనస కాయలను కోస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. చెట్టుకు ఉన్న ఆ పనస కాయలను కోయడానికి ఏనుగు చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఆటవీ శాఖ అధికారి సాకేత్‌ బడోలా సోమవారం ట్విటర్‌లో షేర్‌ చేశాడు. (ఒళ్లు గ‌గుర్పొడిచే దృశ్యాలు: ల‌క్ష‌లాది మిడ‌తలు..)

దీనికి ‘జాక్‌ఫ్రూట్‌ పట్ల మీకున్న మక్కువ.. అది మిమ్మల్ని చెట్లు ఎక్కేలా చేస్తుంది’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. గజరాజు పనస కాయల కోసం చెట్టు ఎక్కడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఉత్తమమైన దొంగతనం’, ‘మనసుంటే మార్గం ఉంటుంది’, ‘అద్భుతం’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. (కంటతడి పెట్టించావురా బుడ్డోడా..)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా