‘భయానకంగా మారొచ్చు.. అలా చేయాలి’

3 Apr, 2020 16:32 IST|Sakshi

డెహ్రాడూన్‌: నగర శివారులో ఖాళీగా ఉన్న రోడ్డుపైకి షీ​కారుకు వచ్చిన ఓ ఏనుగును చూసి వాహనదారుడు బెంబెలేత్తి పారిపోయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అటవీ అధికారి సుశాంత్‌ నందా తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘అది ఏం చేయదు.. నీ దారిన నువ్వు వెళ్లిపో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్‌ చేసిన ఈ వీడియోలో.. పొద్దున్నే పాలు అమ్మేందుకు వెళ్తున్న ఓ వ్యక్తికి ఏనుగు ఎదురుపడింది. దాన్ని చూసి కంగుతిన్న ఆ వాహనదారుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. అతన్ని చూసిన ఏనుగు కూడా కాస్తా ఆగి అతన్ని గమనించింది. (కరోనా: చేతులు కడుక్కున్న చింపాంజీ)

ఇక వెంటనే ఏనుగు అతని వైపుకు నడవడం మొదలు పెట్టగానే ఆ వ్యక్తి తన బండిని కింద పడేసి పరిగెత్తి జాగ్రత్త పడ్డాడు. అయితే అదే సమయంలో ఈ సంఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి ‘‘అది ఏం చేయదు... నీ దారిన నువ్వు వెళ్లిపో’’ అంటూ అరుస్తున్నాడు. ఇక ఆ వ్యక్తి మాటలకు సుశాంత్‌ నందా స్పందిస్తూ ‘ఏనుగును ఎదుర్కొవాలంటే ధైర్యం కావాలి. నిపుణత కలిగిన వారు మాత్రమే దానిని ఎదుర్కొగలరు. మనిషి, ఏనుగు ఎదురుపడినప్పుడు అది భయానక ఘటనగానైనా మారవచ్చు. కానీ ఏదేమైనా ఆ వాహనదారుడిలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు