రైలు ఢీకొని.. విషాదం!

11 Feb, 2018 12:03 IST|Sakshi
మృతి చెందిన ఏనుగుకు పూలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న స్థానిక మహిళ

గువాహటి (అసోం) : అసోంలో అత్యంత హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. హబైపుర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొట్టడంతో నాలుగు ఏనుగులు దుర్మరణం పాలవ్వగా, ఓ ఏనుగుకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గువాహటి- సిల్చార్‌ ప్యాసింజర్‌ రైలు ఐదు ఏనుగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందాయి.

ఏనుగులను వేగంగా ఢీకొట్టడంతో రైలు కుదుపునకు గురైంది. దీంతో రైలు ఇంజిన్‌ బోగీలనుంచి విడిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి రైల్లో ఉన్న వందలాది ప్రయాణికులు భయాందోళలనలకు గురయ్యారు. అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలో గత డిసెంబర్‌లో గుహవాటి-నాహర్‌లాగున్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఐదు ఏనుగులు మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాది అసోంలో రైలు ఢీకొని 12 ఏనుగులు మృతిచెందాయి. 2011 సెన్సెస్‌ లెక్కల ప్రకారం 5,620 ఏనుగులతో అసోం రాష్ట్రం భారత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. రైలు ప్రమాదాల నుంచి ఏనుగులను రక్షించడానికి రైల్వే శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాలు విస్తరిస్తుండటంతో అడవుల నరికివేత జోరుగా సాగుతోంది. దీంతో అడవుల వైశాల్యం తగ్గడంతో అక్కడ నివసించే జంతువులకు రక్షణ కరువైంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మా, వ‌చ్చేయ‌మ్మా: న‌ర్సు కూతురి కంట‌త‌డి

వారిని రోడ్డుకీడ్చిన కరోనా..

'నేను క్వారంటైన్‌లో ఉన్నా.. మరి మీరు'

ఏప్రిల్‌ వచ్చేసరికి మారిన పరిస్థితి..

మాస్క్‌ ధరించకుంటే రూ. 200 ఫైన్‌

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు