అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

25 Jul, 2018 10:43 IST|Sakshi

శ్రీనగర్‌ : జుమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు​ కొనసాగుతున్నాయి. జిల్లాలోని లాల్‌ చౌక్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంలో సైన్యం ఆ ప్రాంతాన్ని అర్ధరాత్రి నుంచి జల్లెడ పడుతుంది. భద్రతా బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతికాల్పులు జరుపుతున్నారు.

ఉయం నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున కాల్పుల, పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొందరు తీవ్రవాదులు ఇక్కడి ఇళ్లలో ఉన్నారనే సమాచారంతో తాము కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్టు తెలిపారు. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ ప్రారంభం కాగానే అధికారులు అనంత్‌నాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా శ్రీనగర్‌ నుంచి బనిహల్‌ మార్గంలో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నుట్టు రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు