మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!

3 Dec, 2016 09:22 IST|Sakshi
మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
గత సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఓ యువ ఇంజనీరు చూపించిన ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతడిని ఎంతగానో ప్రశంసించారు. కానీ.. మోదీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త 2000 రూపాయల నోట్లకు నకిలీనోట్లను ముద్రించినందుకు పోలీసులు అతడిని పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టుచేశారు. అతడి వద్ద రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ వర్మ అనే ఈ యువ ఇంజనీరుతో పాటు, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్‌లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ముగ్గురూ ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, తాము ముద్రించిన 2000 రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో ఇస్తున్నారు. కొత్త నోట్లు ఇచ్చినందుకు వాళ్ల దగ్గర 30 శాతం కమీషన్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇంతా చేస్తే.. వాళ్లిచ్చేది దొంగనోట్లు. ఆ విషయం తెలియక ఇప్పటికి ఎంతమంది వాళ్ల బుట్టలో పడ్డారో తెలియదు.