ఇది మానవతప్పిదమే: గాడ్గిల్‌

19 Aug, 2018 04:33 IST|Sakshi

పణజీ: కేరళ ప్రకృతి విలయానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ అన్నారు. పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల బృందానికి నేతృత్వం వహించిన ఆయన.. నదీ తీరాలపై అక్రమ నిర్మాణాలు, అక్రమ క్వారీలు, మైనింగ్‌ కారణంగానే విపత్తు తలెత్తిందన్నారు. ‘నాటి మా నివేదికను ప్రభుత్వం మినహా ఎవరూ తప్పుబట్టలేదు. అక్రమ మైనింగ్, క్వారీయింగ్‌లనుంచి పశ్చిమ కనుమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి విపత్తులు తప్పవు. కేరళలో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. అసాధారణవర్షాలు కాదు’ అన్నారు.

మరిన్ని వార్తలు