కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట

1 Mar, 2016 05:56 IST|Sakshi
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట

దేశంలో ఉపాధి కల్పన పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. కొత్త ఉద్యోగులకు కంపెనీల బదులు ప్రభుత్వమే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కు 8.33 శాతం మొత్తాన్ని జమచేయనున్నది. ఉపాధి కల్పనకు ఊతమిచ్చేదిశగా ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ప్రతిపాదన చేసారు. ఉద్యోగి నియామకం తర్వాత మూడేళ్ల వరకూ ప్రభుత్వం ఈ చెల్లింపు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. రూ. 15,000లోపు వేతనంతో నియమించుకునే కొత్త ఉద్యోగులకు 8.33 శాతం ఈపీఎఫ్‌ను కంపెనీల తరపున ఇక మీదట ప్రభుత్వమే చెల్లించడం కంపెనీలకు ఊరటనిచ్చే అంశం. కాగా ఉపాధి పెరుగుదల కోసం 2016-17 చివరి నాటికి 100 మోడల్ కెరీర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజెస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు