భత్యాలను మూలవేతనంలో కలపొద్దు

6 Apr, 2014 01:55 IST|Sakshi

ఈపీఎఫ్‌ఓకు కార్మిక శాఖ ఆదేశం
 న్యూఢిల్లీ: భవిష్య నిధి (పీఎఫ్)కి సంబంధించిన కోతలకు గాను భత్యాలన్నిటినీ మూలవేతనంలో కలిపే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)ను ఆదేశించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓకు కార్మిక శాఖ నుంచి ఓ లేఖ అందింది. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపారుు. ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టరుుతే సంస్థ నిర్వహించే పలు పథకాల కింద సంఘటిత రంగంలోని సుమారు ఐదు కోట్ల మంది కార్మికుల పొదుపు మొత్తాలు పెరిగేవని నిపుణులంటున్నారు.
 
  పీఎఫ్ ఖాతాదారులు ఇంటికి తీసుకెళ్లే వేతనం తగ్గడంతో పాటు యూజమాన్యాలపై ఆర్థిక భారాన్ని పెంచేదని చెబుతున్నారు. పీఎఫ్ కోతలకు సంబంధించి మూలవేతనాల అర్ధాన్ని పున ఃనిర్వచించిన ఈపీఎఫ్‌ఓ 2012 నవంబర్ 30న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులకు సాధారణంగా, తప్పనిసరిగా, ఒకేరకంగా చెల్లించే భత్యాలన్నిటినీ మూల వేతనాలుగానే పరిగణించాలని తెలిపింది. అరుుతే ఈ సర్క్యులర్ అమలును నిలిపివేసిన ఈపీఎఫ్‌ఓ ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి చర్యలను కార్మిక శాఖకు సిఫారసు చేసేందుకు గాను ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ భత్యాలను మూలవేతనంలో కలిపే ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ఈపీఎఫ్‌ఓకు ఆదేశాలిచ్చింది.
 

మరిన్ని వార్తలు