0.5 శాతానికి ఈపీఎఫ్‌వో పరిపాలనా రుసుము

28 May, 2018 04:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు కంపెనీల యజమానులు చెల్లించే పరిపాలనా రుసుము 0.5 శాతానికి తగ్గింది. దీంతో అన్ని కంపెనీలకూ కలిపి ఏటా మొత్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గనుంది. ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనంలో 0.65 శాతాన్ని పరిపాలనా రుసుము కింద కంపెనీలు ఇప్పటివరకు ఈపీఎఫ్‌వోకు చెల్లించేవి. వచ్చే నెల నుంచి ఈ రుసుమును 0.15 శాతం తగ్గించి 0.5 శాతంగా ఉండేలా ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య పెరుగుతున్నందున తమ పరిపాలనా ఖర్చులకు అవసరమైన వాటికన్నా ఎక్కువ నిధులే వస్తున్నాయనీ, ఈ కారణంగానే చార్జీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర భవిష్య నిధి కమిషనర్‌ వీపీ జాయ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు