పెన్షనర్లకు 764 కోట్లు: ఈపీఎఫ్‌వో

7 May, 2020 09:47 IST|Sakshi

న్యూఢిల్లీ: పెన్షన్‌ పథకంలో భాగంగా ఏప్రిల్‌ మాసానికి 65 లక్షల మంది పెన్షనర్లకు రూ.764 కోట్లను అందించినట్లు భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపింది. మొత్తంగా 135 ఈపీఎఫ్‌వో ఫీల్డ్‌ ఆఫీస్‌లు ఈ నగదును ముందస్తుగా ఇచ్చే పనిలో నిమగ్నమయ్యాయని కేంద్ర కార్మిక శాఖ ప్రకటన తెలిపింది. నగదు పంపిణీ ప్రక్రియలో ఈపీఎఫ్‌వో అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషిచేశారని, దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్‌లు తమ నోడల్‌ బ్రాంచీల ద్వారా పెన్షనర్లకు నగదును తగు సమయానికి అందించాయని కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది.  

పీఎం కేర్స్‌కు సాయుధ దళాల భారీ సాయం
పదిహేను లక్షల మంది సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగస్తులు, అధికారులు రానున్న 11 నెలల పాటు ప్రతినెలా ఒకరోజు వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి(పీఎం కేర్స్‌)కి స్వచ్ఛందంగా ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రూ. 5,500 కోట్లు ప్రధాని సహాయనిధికి జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పీఎం కేర్స్‌కి సిబ్బంది వేతనాలనుంచి ఇచ్చే విరాళం మే 2020నుంచి ప్రారంభమై మార్చి 2021 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

చదవండి: లాక్‌డౌన్‌ని ఎంతకాలం పొడిగిస్తారు?

మరిన్ని వార్తలు