క్వారంటైన్ నుంచి పారిపోయిన క‌రోనా పేషంట్‌

7 Apr, 2020 20:49 IST|Sakshi

బాగ‌ప‌ట్ (యూపీ) : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లాలో మంగ‌ళ‌వారం ఆసుప‌త్రి నుంచి త‌ప్పించుకున్న క‌రోనా రోగిని  పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ఢిల్లీ జ‌మాత్‌కు హాజ‌రైన సఫీద్ మియాన్ అనే వ్య‌క్తిని సోమ‌వారం రాత్రి పోలీసులు క్వారంటైన్‌కు త‌ర‌లించ‌గా త‌న బ‌ట్ట‌ల‌నే తాడుగా ఉప‌యోగించి ఆసుప‌త్రి వార్డులోని కిటికీ అద్దాలు బ‌ద్దులుకొట్టి పారిపోయాడు. ఇత‌ని వ‌య‌సు 60 ఏళ్ల‌ని పోలీసులు తెలిపారు. జమాత్‌కు హాజ‌రైన నేపాల్ బృందంలోని 17 మందిలో స‌ఫీద్ మియాన్ ఒక‌రు. 

హాస్పిట‌ల్ నుంచి త‌ప్పించుకోవ‌డంతో స‌ఫీద్ పోటోలను విడుద‌ల చేసి, ఎక్క‌డైనా క‌నపిస్తే స‌మాచారం అందివ్వాల‌ని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ప‌ది బృందాలుగా ఏర్ప‌డి కొద్ది గంట‌ల్లోనే అత‌న్ని అరెస్ట్ చేసి తిరిగి హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం స‌ఫాద్ మియాన్ ఎవ‌రెవ‌రిని కలిశాడ‌న్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. భార‌త్‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుంద‌నుకున్న స‌మ‌యంలో ఢిల్లీ నిజాముద్దీన్ ఘ‌ట‌న ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది.  ఇప్ప‌డు దేశంలో న‌మోద‌వుతున్న కోవిడ్-19 కేసుల‌న్నీజ‌మాత్ మ‌ర్క‌జ్ లింకులే. 


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు