ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్‌ సంచలన ఆరోపణలు

10 Oct, 2017 18:05 IST|Sakshi

సంఘ్‌ శాఖలో షార్ట్స్‌ ధరించిన స్త్రీలను చూశారా?

మహిళల హక్కులను కాలరాస్తున్న బీజేపీ

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాం‍ధీ

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంఘ్‌, భారతీయ జనతాపార్టీలపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజీపీలు మహిళలపై తీవ్ర వివక్ష చూపుతున్నాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుజరాత్‌లో పర్యటించిన రాహుల్‌ గాంధీ ఒక కార్యక్రమంలో ఈ విధంగా బీజేపీ, సంఘ్‌లను ఉద్దేశించి మాట్లాడారు.

బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ మాతృసంస్థ. ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ సమావేశాల్లో పాల్గొనేవారు..ఖాకీ యూనిఫారమ్‌న ధిరిస్తారు. అయితే సంఘ్‌లో కార్యకర్తలు ఎవరైనా షార్ట్ ఖాకీ యూనిఫారం ధరించడాన్ని మీరెవరైనా.. ఎప్పుడైనా చూశారా..అని ఆయన ప్రశ్నించారు. ఇదం‍తా ఒక ఎత్తు అయితే.. సంఘ్‌లో మహిళా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు.. వాళ్లెనెప్పెడైనా చూశారా? అని రాహుల్‌ ప్రశ్నించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు మహిళలు మౌనంగా ఉండాలని కోరుకుంటాయని ఆయన చెప్పారు. ఒకవేళ మహిళల నోరు తెరిచేందుకు ప్రయత్నిస్తే.. నోటికి తాళం వేసేందుకు నాయకులు పరుగులు తీస్తారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే.. మహిళా సాధికారత కల్పిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. అంతేకాక  మహిళా విద్య, ఆరోగ్యం​, ఇతర రంగాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు