'ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్'

25 Oct, 2016 13:04 IST|Sakshi
'ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్'

లక్నో: సమాజ్ వాదీ పార్టీలో అంతా సవ్యంగా ఉందని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం గురించి ఆయనను విలేకరులు ప్రశ్నించగా... 'ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్. నేతాజీ(ములాయం సింగ్) ఆదేశాలను పాటిస్తాన'ని సమాధానం ఇచ్చారు.

సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ములాయం ఎదుటే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ తలపడ్డారు. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. వేదికపైనే గట్టిగా కేకలు వేసుకున్నారు. అఖిలేశ్ అబద్దాలకోరు అని శివపాల్ ధ్వజమెత్తారు. అఖిలేశ్ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కోవాలని ములాయంకు సూచించారు. తన తండ్రి తప్పుకోమంటే సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధమని అఖిలేశ్ ప్రకటించారు.

చివరకు ఇద్దరి మధ్య ములాయం సయోధ్య కుదిర్చారు. శివపాల్ సహా తొలగించిన మంత్రులను తిరిగి కేబినెట్ లో చేర్చుకునేందుకు అఖిలేశ్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ములాయం కుటుంబంలో రేగిన విభేదాలు సమాజ్ వాది పార్టీలో తీవ్ర కలకలం రేపాయి.

మరిన్ని వార్తలు