ఎన్నికల్లో బ్లాక్‌చైన్‌ వ్యవస్థ

13 Feb, 2020 08:16 IST|Sakshi

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా  

న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్‌తో కలసి బ్లాక్‌ చైన్‌ వ్యవస్థపై పనిచేస్తున్నామని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ‘టైమ్స్‌ నౌ సమిట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవీఎంల గురించి పలు విషయాలు మాట్లాడారు. బ్లాక్‌చైన్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్‌ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని చెప్పారు. ఉదాహరణకు రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి చైన్నైలో ఉద్యోగం చేస్తుంటే, రాజస్తాన్‌లో జరిగే ఎన్నికలకు చైన్నైలోనే ఓటేయవచ్చు. కారు లేదా పెన్నులాగే ఈవీఎంలు కూడా మొరాయించవచ్చేమోగానీ టాంపర్‌ చేయడం అసాధ్యమని చెప్పారు. 

మరిన్ని వార్తలు