బ్రిటన్‌ ఎంపీ వీసా రద్దు

13 Jul, 2018 04:13 IST|Sakshi
లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లైల్‌

న్యూఢిల్లీ: బ్రిటన్‌ ఎంపీ, బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలేదా జియా లాయర్‌ అయిన లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లైల్‌ వీసాను భారతప్రభుత్వం రద్దు చేసింది. మీడియా సమావేశం ద్వారా భారత్‌–బంగ్లా సంబంధాల్లో సమస్యలను సృష్టించాలని చూస్తున్నారనే కారణాలతో గత రాత్రి బ్రిటన్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కార్లైల్‌ను వెనక్కి పంపించింది. ‘కార్లైల్‌ మీడియా సమావేశంలో మాట్లాడటం వీసా నిబంధనలకు విరుద్ధం. రాజకీయ కార్యకలాపాలకు పాల్పడే వారికి ఏ దేశమూ వీసా ఇవ్వదు. ఆయనకు జారీ చేసిన బిజినెస్‌ వీసాతో మీడియా సమావేశం నిర్వహించరాదు. మూడో దేశానికి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు ఓ విదేశీయుడిని భారత్‌ ఎలా అనుమతిస్తుంది?’ అని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు