షాకింగ్‌: మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు

1 Aug, 2019 18:03 IST|Sakshi

ట్యూటికోరన్‌: మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌ అబ్దుల్‌ గఫూర్‌ను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులోని ట్యూటికోరన్‌ ఓడరేవులో ఆయనను అరెస్టు చేశారు. టగ్‌ బోటులో ప్రయాణిస్తూ.. క్రూ మెంబర్‌గా చెప్పుకొని అక్రమంగా భారత్‌లో వచ్చేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఆయన భారత్‌కు వచ్చారని, అక్రమంగా అదీబ్‌ దేశంలోకి వచ్చే అగత్యం ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి. మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడి అరెస్టుపై సమాచారమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖకు ఐబీ ఓ రిపోర్ట్‌ పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మాల్దీవుల ప్రభుత్వంతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు