క‌రోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు మృతి

1 Jul, 2020 14:51 IST|Sakshi

ల‌క్నో :  ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తూనే ఉంది. క‌రోనాకు సామాన్యులు, ప్ర‌ముఖులు అన్న తేడా లేదు. ఇప్ప‌టికే ఎంతోమంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా  కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ వ‌ర్మ  (40) మంగ‌ళ‌వారం క‌రోనా కార‌ణంగా  మ‌ర‌ణించాడు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేష‌న్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగి అయిన దినేష వ‌ర్మ‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. లక్నో నగరానికి చెందిన దినేష్‌కు కొద్ది రోజుల క్రిత‌మే క‌రోనా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం  క‌న్నుమూశారు. అయితే గ‌తంలోనూ దినేష్ వ‌ర్మ‌కు కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌లున్న‌ట్లు స‌మాచారం. 2007లో దినేష్ మూత్ర‌పిండ మార్పిడి చేయుంచుకున్నాడ‌ని అప్ప‌టినుంచి అనారోగ్యంతో  బాధ‌ప‌డుతున్న‌ట్లు  ఆయ‌న స్నేహితుడు వెల్ల‌డించారు. (మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి )

కాగా సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ కాంగ్రెస్ హ‌యాంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఈ ఏడాది మార్చి 27న మ‌ర‌ణించారు. నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇప్పుడు కూమారుడు కూడా చ‌నిపోవ‌డంతో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.  సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బేణిప్ర‌సాద్ వ‌ర్మ‌కు ములాయం సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.  ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ దినేష్ వ‌ర్మ కుటుంబానికి సంతాపం తెలిపారు. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు )


 

మరిన్ని వార్తలు