ఆన్‌లైన్‌ బోధనవైపు ఐఐటీ బాంబే

31 May, 2020 20:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్త లాక్‌ డౌన్‌ విధించింది. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు  ఐఐటీ(బాంబే) ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఐఐటీలో ఆన్‌లైన్‌ బోధనకు సంబంధించి కొందరు బోధన సిబ్బంది తమ మనోభావాలను పంచుకున్నారు. ఆన్‌లైన్‌లో బోధించడం వల్ల తమలో సాంకేతిక నైపుణ్యం పెరిగిందని లెక్చరర్లు అభిపప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ బోధన ద్వారా వీడియో కాన్ఫరెన్సులు, అదనపు సమాచారం, డిజిటల్‌ నోట్స్‌, వీడియా రికార్డింగ్స్‌ లాంటి అంశాలలో ప్రావీణ్యం సాధించమని బోధన సిబ్బంది పేర్కొన్నారు.

తాజాగా ఆన్‌లైన్‌ బోధనపై యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఓ సర్వే నిర్వహించారు. సర్వేలో 2,500మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 37 శాతం మంది ఆన్‌లైన్‌ తరగతుల వైపు మొగ్గు చూపగా.. 18శాతం మంది విద్యార్థులు వ్యతిరేకించారు. 90శాతం మంది విద్యార్థులు తరగతి బోధనల కంటే వీడియో రికార్డింగ్‌లకే సానుకూలమని తెలిపారు. కాగా సైన్స్‌ కోర్సులు ఆన్‌లైన్‌లో బోధించడం వల్ల విద్యార్థులు ల్యాబ్‌లో ప్రయోగం చేసే అవకాశం కోల్పోతారని కొందరు విద్యావేత్తలు భావిస్తున్నారు. 

చదవండి: ఐఐటీల్లో అమ్మాయిలు అంతంతే! 

మరిన్ని వార్తలు