ముఖంలోనే జబ్బుల లక్షణాలు

8 Aug, 2019 13:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముఖారవిందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మహిళలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడమే కాకుండా ముఖానికి వికారంగా మొటిమలు పెరిగిపోతున్నాయంటూ స్కిన్‌ స్పెషలిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇటీవల డెర్మటాలజిస్టుల సంఖ్య కూడా ఏకంగా 200 శాతానికి పెరిగింది. ముఖాన మొటిమలుగానీ, గాయం లాంటి మడతలుగానీ ఊరికే రావట. శరీరంలోని అంతరావయాల్లో కలిగే మార్పులు లేదా లోపాలను ఎత్తిచూపడం కోసం అవి వస్తాయట. ఈ విషయాన్ని చైనా ఆయుర్వేద వైద్యులు ‘ఫేస్‌ మ్యాపింగ్‌’ ద్వారా ఎప్పుడో తేల్చి చెప్పారు.

కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని చూసి ‘జాండిస్‌’ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్న విషయం కూడా మనకు తెల్సిందే. అలాగే కుడి బుగ్గ వద్ద చీలినట్లయితే ఊపిరి తిత్తులకు సంబంధించి ఏదో సమస్య ఉన్నట్లు లెక్కట. అలాగే గుండె గురించి ముక్కు, హార్మోన్ల గురించి గడ్డం చెబుతుందట. చైనా  ఆయుర్వేద వైద్యుల ఈ నమ్మకాలు నిజమేనని న్యూయార్క్‌కు చెందిన డ్యాన్‌ హుసు కూడా నిర్ధారిస్తున్నారు. మన ముఖంలోని ప్రతిభాగం మన శరీరంలోని ఒక్కో అవయవానికి ప్రాతినిథ్యం వహిస్తాయని ఆయన చెప్పారు. 

1. కనుబొమ్మలుపైన: మొటిమలు వస్తే గాల్‌ బ్లాడర్, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నట్లు లెక్క. కొవ్వు పదార్థాలు, శుద్ధి చేసిన ఆహారం తగ్గిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్‌ డ్యాన్‌ సూచించారు. 
2. రెండు కనుబొమ్మల మధ్య: మొటిమలు వస్తే ఎక్కువగా మద్యం, ధూమపానం సేవిస్తున్నట్లు సూచనట. 
3. ముక్కుమీద మొటిమలు వస్తే: హృదయం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. అంటే ఉప్పు, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండమే కాకుండా బీ విటమిన్‌ ట్యాబ్లెట్లు తీసుకోవాలని డాక్టర్‌ సూచిస్తున్నారు. 
4. ఇక ఎడమ బుగ్గ నేరుగా కాలేయానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అక్కడ మొటిమలు వస్తే చల్లటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలట. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలట. 
5. ఇక నోరు మనలోని జీర్ణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందట. నోటి దగ్గర మొటిమలు లేదా కురుపులు కనిపిస్తే ఫైబర్, కూర గాయలు ఎక్కువగా తీసుకోవాలట. 
6. ముఖం మీది చర్మం శీరరంలోని హార్మోన్లను సూచిస్తుందట. ఒమెగా 3 తీసుకుంటే సమతౌల్యం అవుతాయట. చైనా ఆయుర్వేద వైద్యులు ముఖంలోని మార్పులనుబట్టి శరీరంలోని లోపాలను లేదా జబ్బులను చెప్పి ఉండవచ్చు. న్యూయార్క్‌లోని ఈ డాక్టర్‌ మాత్రం శరీరంలోని లోపాల వల్ల మొటిమలు వస్తాయని, వాటిని ఎలా నివారించవచ్చో సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు