ఆమె జీతం రూ. 5.04 కోట్లు కాదు.. రూ. 42 లక్షలే

6 Nov, 2019 21:05 IST|Sakshi

లవ్లీ ప్రొపెషనల్‌ యునివర్సిటీ(ఎల్‌పీయూ)కి చెందిన తాన్యా అరోరా అనే విద్యార్థినికి ఏడాదికి రూ. 5.04 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాన్యా అరోరాకు ఉద్యోగం వచ్చిన విషయం వాస్తమే అయినప్పటికీ ఆమె వార్షిక వేతనం ఏడాదికి రూ. 42 లక్షలు మాత్రమే. ఏటా రూ. 5.04 కోట్ల భారీ వేతనంతో ఉద్యోగం వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా తేలింది. 

ఇదే విషయంపై ఎల్‌పీయూ ట్విటర్‌ వేదికగా స్పందించింది. తాన్యా అరోరా ఎల్‌పీయూలో బీటెక్‌(సీఎస్‌ఈ) చదువుతోందని,  ఈ మధ్యే మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి రూ.42 లక్షల వేతనంతో ఆమె ఉద్యోగం సాధించిందని ఎల్‌పీయూ తెలిపింది.  ఏడాదికి రూ. 42 లక్షలు కాగా, దానిని నెలవారి వేతనంగా భావించి పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని ఎల్‌పీయూ ట్వీట్‌ చేసింది. దీంతో ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టమైంది.  
 

మరిన్ని వార్తలు