నవలఖ విడుదలపై సుప్రీంకు మహారాష్ట్ర

4 Oct, 2018 06:37 IST|Sakshi

న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవలఖ(65)ను గృహనిర్బంధం నుంచి విడుదలచేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిశాంత్‌ కట్నేశ్వర్‌ బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్‌ దాఖలుచేశారు. సీఆర్పీసీలోని సెక్షన్‌ 167(1), (2)లను తప్పుగా అర్థం చేసుకున్న హైకోర్టు పొరపాటున నవలఖను విడుదల చేసిందని, అతని ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో తెలిపింది. సెక్షన్‌ 167(1) ప్రకారం నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటే సంబంధిత పోలీస్‌ అధికారులు కేస్‌ డైరీని రూపొందించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే తమ న్యాయపరిధిలో లేని నిందితుల ట్రాన్సిట్‌ రిమాండ్‌ కోరేటప్పుడు కేస్‌ డైరీని సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు