టాపర్స్ స్కాం: సర్టిఫికేట్కు ఐదు లక్షలు!

15 Jun, 2016 10:25 IST|Sakshi
టాపర్స్ స్కాం: సర్టిఫికేట్కు ఐదు లక్షలు!

పాట్నా:బిహార్ ఇంటర్మీడియట్ టాపర్స్ స్కాంలో విచారణ అధికారులు పురోగతి సాధించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం పాట్నాలోని గంగా దేవి మహిళా కాలేజీ పరిధిలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ స్కాంతో సంబంధమున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వెల్లడించిన వివరాల ప్రకారం అక్రమ మార్గంలో సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులు.. సర్టిఫికేట్కు రూ. 5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. డబ్బు చెల్లించిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకుండానే సర్టిఫికేట్లు పొందినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్ధులు ఏదైనా కాలేజీ నుంచి కనీసం అడ్మిషన్ కూడా తీసుకోలేదని దర్యాప్తులో తేలింది.

ఈ స్కాంలో పాత్రధారులుగా భావిస్తున్న బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు(బీఎస్ఈబీ) చైర్మన్ లోకేశ్వర్ ప్రసాద్ సింగ్, ఆయన సతీమణి, జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాల ప్రమేయంపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో కీలకమైన వ్యక్తి, విషున్ రాయ్ కాలేజ్ డైరెక్టర్ బచ్చన్ రాయ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

 

మరిన్ని వార్తలు