అనాథని ఆదరిస్తే.. కన్నబిడ్డనే కాటేశాడు

4 Dec, 2015 11:45 IST|Sakshi
అనాథని ఆదరిస్తే.. కన్నబిడ్డనే కాటేశాడు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. అనాథను ఆదరించి కన్నకొడుకులా చూసుకున్న కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చాడో దుర్మార్గుడు. ఢిల్లీకి చెందిన రాజ్‌కుమార్‌ (22) సొంత సోదరి లాంటి యువతి (17)పై లైంగిక దాడికి పాల్పడి,  అడ్డొచ్చిన ఎనిమిదేళ్ల బాలుడ్ని పొట్టనబెట్టుకున్నాడు.

చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న రాజ్‌కుమార్‌ను ఢిల్లీ కద్దా కాలనీలో ఉండే ఓ కుటుంబం ఆదరించింది. కన్నకొడుకులా సాకింది. వారికి ఓ కూతురు కూడా ఉంది. వయసు పెరిగిన కొద్దీ  వాడిలో దుర్భుద్ధి మొదలైంది. అన్నలా అండగా ఉండాల్సినవాడు కాస్తా కీచకుడిలా మారిపోయాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చెయ్యాలని చాలాసార్లు వాళ్లతో గొడవపడ్డాడు. తల్లిదండ్రులు తప్పని వారించారు. ఈ క్రమంలో తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన రాజ్కుమార్ చెంప పగలగొట్టిందా యువతి. దీంతో ఇంట్లోంచి వెళ్లిపోయి.. ఆమెపై మరింత పగ పెంచుకున్నాడు.

తర్వాత కుటుంబ అవసరాల నిమిత్తం ఆ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ బట్టల షాపులో ఉద్యోగం  చూసుకుంది. ఆఫీసుకు దగ్గరగా బంధువుల ఇంట్లో ఉంటోంది. ఇది తెలిసి రాజ్‌కుమార్‌ పథకం ప్రకారం ఆమెపై దాడి చేశాడు. పొద్దున్నే ఇంట్లోకి చొరబడి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె  తీవ్రంగా ప్రతిఘటించినా వదల్లేదు. రాడ్డుతో తలపై బలంగా మోదాడు. ఇంతలో  ఆమె కేకలు విన్న ఎనిమిదేళ్ల బాలుడు ఆ దుర్మార్గుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చిన్న పిల్లాడనే విచక్షణ మర్చిపోయి ఉన్మాదిలా మారి రాడ్డుతో ఆ పిల్లాడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలొదలడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాము కొడుకులా భావించినవాడే.. తమకు తీరని శోకాన్ని మిగిల్చాడంటూ  బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా