యూపీ టెన్త్‌ రిజల్ట్‌: సత్తా చాటిన రైతు బిడ్డ

29 Apr, 2018 20:18 IST|Sakshi

లక్నో: సాధారణ రైతు బిడ్డ ఉత్తరప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో దుమ్మురేపారు. మొత్తం 600 మార్కులకుగాను 578 మార్కులు (96.3%) సాధించి టాపర్‌గా నిలిచింది. ఆదివారం యూపీఎంఎస్‌పీ విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో అలహాబాద్‌కు చెందిన  రైతు బిడ్డ అంజలి వర్మ స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టాపర్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘మా నాన్న రైతు. చాలా కష్టాలు ఉన్నప్పటికీ నన్ను చదివించాడు. టీచర్లు ప్రతి విషయంలో సహాయం చేశారు. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను. ప్రతి విషయంలో సపోర్టుగా నిలిచిన నా తల్లిదండ్రులకి, టీచర్లకి థ్యాక్స్‌.  నేను గొప్ప ఇంజనీర్‌ అయి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని అంజలి తెలిపారు. యూపీలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు నిర్వహించారు. దాదాపు 37 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రాశారు.

మరిన్ని వార్తలు