మొసలి అతడ్ని గట్టిగా పట్టుకుంది.. అప్పుడు..

16 Sep, 2019 20:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌ : గుండె ధైర్యం, సమయస్పూర్తితో ఓ వ్యక్తి మృత్యు ఒడిలోంచి బయటపడగలిగాడు. ఎనిమిది అడుగుల మొసలి నోటినుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని కేంద్రపారా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రపారా జిల్లా మహాకల్పద ఏరియాకు చెందిన భజకృష్ణ ప్రదాన్‌ ఆదివారం చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ఓ ఎనిమిది అడుగుల మొసలి అతడిపైకి దూకింది. వాడైన పళ్లతో అతడ్ని ఒడిసి పట్టుకుంది. ఈ అనుకోని సంఘటనతో ప్రదాన్‌ మొదట షాక్‌కు గురైనా.. ఆ వెంటనే తేరుకున్నాడు. గుండె ధైర్యం, సమయస్పూర్తితో తన పక్కనే ఉన్న వెదురు కర్రతో దాని కంటిపై బాదాడు. అతడ్ని పట్టుకున్న మొసలి నొప్పి తాళలేక విడిచిపెట్టి నీటిలోకి వెళ్లిపోయింది. ప్రదాన్‌ బ్రతుకు జీవుడా అంటూ అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ దాడిలో ప్రదాన్‌ కుడి చేయికి చిన్న గాయం మాత్రమే అయ్యింది.

చదవండి : వైరల్‌: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా