సీబీఎస్‌ఈలో సత్తా చాటిన రైతు కొడుకు

16 Jul, 2020 17:00 IST|Sakshi

లక్నో: ఉత్తప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు కుమారుడు సీబీఎస్‌ఈ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అద్భుత ప్రతిభను కనబరడిచాడు. లఖింపూర్‌కు చెందిన అనురాగ్‌ తివారీ తాజాగా విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 98.2 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అంతేకాకుండా అమెరికా కార్నెల్‌‌ యూనివర్సిటీలో ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎంపికయ్యాడు. 


ఈ సందర్భంగా అనురాగ్‌ మాట్లాడుతూ.. ‘నేను సీతాపూర్‌లోని శివనాదర్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన విద్యాగ్వాన్‌ లీడర్‌షిప్‌ అకాడమీలో చదివాను‌. మొదట్లో సీతాపూర్‌ పంపించేందుకు నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా నాన్న రైతు అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కూడా ఎక్కువే. ఇక నేను చదువుకుంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేమోనని వారు భావించి నన్ను కాలేజీ పంపించేందుకు ఇష్టపడలేదు. నా ముగ్గురు సోదరీమణులు వారిని ఒప్పించారు’ అంటూ అనురాగ్‌ చెప్పుకొచ్చాడు. 

ఆర్థిక శాస్త్రం‌లో వందకు 100 మార్కులు:
సీబీఎస్‌ఈ ప్రకటించిన ఇంటర్‌ ఫలితాలలో అనురాగ్‌ అన్ని సబ్జెక్ట్స్‌ల్లోను మెరుగైన ప్రతిభ కనబరిచాడు. గణితంలో- 95, ఇంగ్లీషులో-97, పొలిటికల్ సైన్స్‌లో- 99, హిస్టరీ, ఎకనామిక్స్‌లో- 100 మార్కులు సాధించాడు.  

మరిన్ని వార్తలు