ఐఈఎస్‌లో మెరిసిన రైతు పుత్రుడు

13 Mar, 2014 03:10 IST|Sakshi
 కేంద్రపడ: ఒడిశాలో ఓ పేదరైతు కుటుంబానికి చెందిన శిశిర్ కుమార్ ప్రధాన్ అనే విద్యార్థి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికై సత్తా చాటాడు. లక్షల మంది కలగనే విజయాన్ని తన కుమారుడు 25 ఏళ్లకే సాధించాడని చెబుతూ శిశిర్ తండ్రి బాబాజీ ఛరానా ప్రధాన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు.
 
కేంద్రపడ జిల్లాలోని నిగినీపూర్‌కు చెందిన శిశిర్ తండ్రి ఓ సాధారణ రైతు. తన తండ్రి కష్టపడి చదివిస్తూ తనను ప్రోత్సహించారని శిశిర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో హెచ్‌ఎస్‌సీ, కేంద్రపడ కాలేజీలో ప్లస్‌టూ చదివిన శిశిర్ తర్వాత ఎన్‌ఐటీ రూర్కెలాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎన్‌ఐటీ భోపాల్‌లో సుస్థిర ఇంధనం (రిన్యూవెబుల్ ఎనర్జీ)లో ఎంటెక్ చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు