రైతుల ర్యాలీలో సెల్‌ఫోన్ల చార్జింగ్‌ ప్రత్యేకం

12 Mar, 2018 19:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాసిక్‌ నుంచి ముంబైకి 35 వేల మంది తరలి రావడం ఎంత కష్టమో అంతమందికి వారం రోజులపాటు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం కూడా అంత కష్టమే. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి సమాజంలో సెల్‌ఫోన్లు వాడకుండా ఉండాలంటే కూడా ఎంతో కష్టం. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నేడు రైతులకు కూడా మొబైల్‌ ఫోన్ల వాడకం తప్పనిసరైందని తెల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఫోన్లను చార్జింగ్‌ చేసుకోవడ ఎలా?

దీనికి కూడా రైతులే పరిష్కారం కనుగొన్నారు. స్థానికంగా లభించే పలకలాంటి సోలార్‌ ప్యానెళ్లను వారు సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌కు ఉపయోగించారు. ఆ సోలార్‌ ప్యానెల్‌ ద్వారా ఒకే సారి నాలుగైదు సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేయవచ్చట. ఒక్కసారి చార్జి చేస్తే రెండు, మూడు గంటల వరకు ఫోన్‌ పనిచేస్తుందట. చాలా మంది రైతులు ఇలాంటి సోలార్‌ ప్యానెళ్లను తమ వెంట తెచ్చుకున్నారు. మండుటెండలో కాలినడకను వారం రోజులపాటు నడిచిన రైతులకు ఇంటివారితో మాట్లాడేందుకు ఫోన్లు అందుబాటులో ఉండడం ఎంతో ఉపశమనం కలిగించి ఉంటుంది. రైతుల ర్యాలీలో తలలపై చార్జింగ్‌ సోలార్‌ ప్యానెళ్లను పెట్టుకొని కొంత మంది రైతులు ప్రత్యేకంగా కనిపించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు