ఇక ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ

20 Jan, 2017 03:07 IST|Sakshi
ఇక ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ

సీజేఐ జేఎస్‌ ఖేహర్‌ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దాదాపు 61వేల కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ ట్రాక్‌ మోడ్‌లో పనిచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ స్పష్టం చేశారు. పలు అంశాలపై వేసిన వ్యాజ్యాలను తొలగించబోమని ఆయన భరోసా ఇచ్చారు. ‘మేం ఫాస్ట్‌ట్రాక్‌లో పనిచేస్తాం. ఆందోళన వద్దు. ఏ వ్యాజ్యాన్నీ రద్దుచేసే ప్రసక్తే లేదు’ అని సీజేఐ జస్టిస్‌ ఖేహర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న 15 రోజుల్లోనే సామాజిక న్యాయానికి సంబంధించిన కేసుల వాదనలు వినే ధర్మాసనాన్ని జస్టిస్‌ ఖేహర్‌ పునరుద్ధరించారు.

ఈ సామాజిక న్యాయ బెంచ్‌ను మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు 2014లో స్థాపించారు. కాగా, ఈ ధర్మాసనానికి జస్టిస్‌ మదన్ బీ లోకుర్‌ నాయకత్వం వహిస్తారు. ఈ బెంచ్‌ ప్రతి శుక్రవారం రెండు గంటలపాటు కూర్చుని.. ప్రజాపంపిణీ వ్యవస్థ మొదలుకుని కరువు పరిస్థితులు, కబేళాలు, రాత్రి ఆవాసాలు, ఆరోగ్యం, శుభ్రత, పిల్లల అక్రమ రవాణా వంటి కేసులను విచారించనుంది.

మరిన్ని వార్తలు