ఆ రైళ్లతో పోలిస్తే మన గతిమాన్ ఎక్కడ?

5 Apr, 2016 19:18 IST|Sakshi
ఆ రైళ్లతో పోలిస్తే మన గతిమాన్ ఎక్కడ?

న్యూఢిల్లీ: గతిమాన్ హైస్పీడ్ రైలు ప్రారంభంతో భారతీయ రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నడిచే రైల్లు ఇక మున్ముందు మరింత వేగంగా, తక్కువ సమయంలో దూరాలకు చేరవేస్తాయని సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం దేశంలోనే వేగవంతమైన రైలుగా గతిమాన్ ఎక్స్ ప్రెస్ ను పేర్కొంటూ భారతీయ రైల్వే మంగళవారం ప్రారంభించింది. ఇది ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య ఉన్న 188 కిలోమీటర్ల దూరాన్ని 100 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. అయితే, దేశంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించే రైలుగా చెప్పుకునే ఈ గతిమాన్ ఎక్స్ ప్రెస్ ప్రపంచ దేశాల్లోని కొన్ని రైళ్లతో పోల్చి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే..

షాంఘై మాగ్లేవ్: ఇది చైనాలో ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 430 కిలోమీటర్లు. షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సెంట్రల్ పుడాంగ్ కి మధ్య 30 కిలోమీటర్లు కవర్ చేసేందుకు దీనిని ఏర్పాటుచేశారు. ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 8 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇండియాలోని గతిమాన్ స్థానంలో ఈ రైలును పెడితే ఢిల్లీ నుంచి ఆగ్రాకు మధ్య 25 నుంచి 27 నిమిషాల్లో ప్రయాణిస్తుంది.

గ్రండే విటెస్సీ: ఫ్రాన్స్కు చెందిన గ్రండే విటెస్సీ అనే రైలు వేగం గంటకు 300 కిలోమీటర్లు. దీనిని గతి మాన్ ప్లేస్ లో పెడితే 20 నుంచి 21 నిమిషాల్లో పూర్తి చేస్తుందట.

ఏజీవీ ఇటాలో: ఇది ఇటలీలోని వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 300 కిలోమీటర్లు. దీనిని న్యూఢిల్లీ ఆగ్రా మధ్య పరుగులు పెట్టిస్తే 25 నుంచి 30 నిమిషాల్లో పరుగు పూర్తి చేస్తుందంటున్నారు.

యూరోస్టార్: ఇది ఇంగ్లాండ్లోని వేగవంతమైన రైలు. దీని వేగం కూడా గంటకు 300 కిలోమీటర్లు. ఇది కూడా గతి మాన్ ప్లేస్లోకి వస్తే 25 నుంచి 30 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంటుందట.

ఏసిలా ఎక్స్ ప్రెస్: ఇది అమెరికాలోని వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 240 కిలోమీటర్లు. ఈ రైలును గతిమాన్ తో పోలిస్తే ఢిల్లీ-ఆగ్రాల మధ్య ప్రయాణం 48 నిమిషాల్లో పూర్తి చేస్తుందట.

మరిన్ని వార్తలు