యానిమేషన్‌ ఆద్యుడు రాంమోహన్‌ కన్నుమూత

12 Oct, 2019 09:09 IST|Sakshi

ముంబై: భారత్‌ యానిమేషన్‌ రంగ ఆద్యుడు రామ్‌మోహన్‌(88) శుక్రవారం కన్నుమూశారు. భారత ప్రభుత్వ ఫిల్మ్స్‌ డివిజన్‌ కార్టూన్‌ ఫిల్మ్స్‌ యూనిట్‌లో 1956 వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1968లో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో యానిమేషన్‌ విభాగానికి చీఫ్‌గా చేరారు. 1972లో సొంతంగా తన పేరుతో ‘రామ్‌మోహన్‌ బయోగ్రాఫిక్‌’ సంస్థను స్థాపించారు. దేశంలోనే మంచి పేరున్న ముంబైలోని గ్రాఫిటి మల్టీమీడియా సంస్థకు ఆయన చైర్మన్, చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగారు.

గ్రాఫిటి స్కూల్‌ ఆఫ్‌ యానిమేషన్‌ను 2006లో ప్రారంభించారు. పలు హిట్‌ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు ఆయన యానిమేషన్‌ రూపం ఇచ్చారు. ఎంతో మంది యానిమేషన్‌ నిపుణులను ఆయన తయారు చేశారు. రామ్‌మోహన్‌ మరణం పట్ల యానిమేషన్‌ ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు