రాహుల్‌పై మండిపడ్డ జవాన్‌ తండ్రి

20 Jun, 2020 15:14 IST|Sakshi

‘భారత సైన్యం పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తోంది. చైనా చర్యలను భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. రాహుల్‌.. ఈ విషయంలో రాజకీయాలు చెయ్యొద్దు’ అని గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికుడు సురేంద్ర సింగ్‌ తండ్రి బల్వంత్‌ సింగ్‌ అన్నారు. తన కొడుకు ఇప్పటి వరకు సైన్యంలో పోరాడడని.. ఇక ముందు కూడా పోరాటం కొనసాగిస్తాడని రాహుల్‌ గాంధీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గాయాల నుంచి తన కొడుకు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బల్వంత్‌ సింగ్ ‌శనివారం వీడియో రూపొందించి మాట్లాడారు. (మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ చిదంబరం) 

కాగా గల్వాన్‌ లోయ వద్ద భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘటనపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ చైనా దురాక్రమణకు తలొగ్గిన నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు అప్పజెప్పారని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీని కాపాడేందుకు కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇందుకు బల్వంత్‌ ఇంతకముందు మాట్లాడిన ఓ వీడియోను రాహుల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. (రాహుల్‌-అమిత్‌ షా మధ్య ట్విటర్‌ వార్‌) 

అయితే అదే బల్వంత్‌ తాజాగా మరో వీడియో తీసి భారత సైన్యం బలమైనదని, చైనాలను ఓడించగలదన్నారు. రాహుల్‌.. గల్వాన్‌  ఘటనను రాజకీయం చేయొద్దు అంటూ సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక బల్వంత్‌ సింగ్‌ మాట్లాడిన వీడియోను హోంశాఖ మంత్రి అమిత్‌ షా సైతం షేర్‌ చేశారు. సైనికుడి తండ్రి రాహుల్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారని, అంతేగాక ఇలాంటి చిల్లర రాజకీయాల నుంచి ఎదగాలని హితవు పలికారు. దేశమంతా ఏకతాటిపై నిలిచిన ఈ సమయంలో రాహుల్‌ మరింత సంఘీభావంతో మెలగాలని సూచించారు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు