ముంబై పేలుళ్లకు గర్వపడుతున్నా: భత్కల్

5 Jul, 2014 04:49 IST|Sakshi
ముంబై పేలుళ్లకు గర్వపడుతున్నా: భత్కల్

ముంబై: ముంబైలో 21 మంది మృతికి కారణమైన 2011నాటి వరుస పేలుళ్లకు పాల్పడినందుకు తనకు గర్వంగా ఉందని ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అన్నాడు. ‘పేలుళ్లకు పశ్చాత్తాపపడ డం లేదు. నా దృష్టిలో అవి నేరం కాదు. అందుకే వాటికి పాల్పడ్డానని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వదలచుకున్నా’ అని ఇటీవల ముంబై పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో చెప్పాడు.
 
  పేలుళ్లకు పశ్చాత్తాపపడడం లేదని భత్కల్ సహచరుడు అసదుల్లా ఆఖ్తర్ కూడా తన నేరాంగీకార ప్రకటనలో పేర్కొన్నాడు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో 2005 నుంచి తాము పాల్పడ్డ పేలుళ్ల వివరాలను వీరు వెల్లడించారు. 2002 నాటి గోధ్రా అల్లర్లకు ప్రతీకారంగానే బాంబులు పేల్చామన్నారు. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ గత ఏడాది ఆగస్ట్‌లో భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేయడం తెలిసిందే.

మరిన్ని వార్తలు