గుజరాత్‌లో మహాభారత యుద్ధం

4 Nov, 2017 02:43 IST|Sakshi

మాది పాండవుల పార్టీ: రాహుల్‌  

పర్దీ: వచ్చే నెలలో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ శుక్రవారం మహా భారతయుద్ధంతో పోల్చి చెప్పారు. పాండవులది కాంగ్రెస్‌ పార్టీ, కౌరవులది బీజేపీ అని అన్నారు. ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్న ఆయన... యుద్ధ సమయంలో కౌరవులకు సైన్యం, ఆయుధాలు ఉండగా, పాండవులవైపు సత్యం మాత్రమే ఉందనీ, అయినా చివరకు సత్యమే గెలిచిందని గుర్తుచేశారు.

గుజరాతీ హిందువులను ఆకట్టుకునేందుకు రాహుల్‌ తరచుగా అక్కడి వివిధ ఆలయాలను సందర్శిస్తుండటం తెలిసిందే. రాహుల్‌ శుక్రవారం  వల్‌సద్‌ జిల్లాలోని శ్రీ రంఛోడ్‌ ఆలయంలో ప్రార్థనలు చేశారు. నోట్లరద్దు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు అని తెలిసినా ఒప్పుకునేందుకు ప్రధానికి అహం అడ్డొస్తోందన్నారు. గుజరాత్‌ దళిత నేత జిగ్నేశ్‌ మేవానీ రాహుల్‌తో భేటీ అయిన అనంతరం కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. నవ్‌సారి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో అర్ధగంటకుపైగా రాహుల్‌తో సమావేశమైన మేవానీ...బయటకు వచ్చిన అనంతరం తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించిందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు