మధ్యప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతి

6 Jul, 2020 11:05 IST|Sakshi

భోపాల్‌: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన నిబంధనలకు అనుగుణంగా మధ్యప్రదేశ్‌లో పలు బాలీవుడ్‌ సినిమా, టీవీ, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించినట్లు  రాష్ట్ర పర్యాటక బోర్డు సలహాదారుడు ఆదివారం తెలిపారు. బోర్డు అదనపు మేనేజింగ్ డైరెక్టర్ సోనియా మీనా మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌లను తిరిగి ప్రారంభించడానికి బోర్డు కొన్ని నియమాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర టూరిజం బోర్డు ఫిల్మ్‌ ఫసిలిటేషన్‌ సెల్‌ కొన్ని నిబంధనలను జారీ చేసిన అనంతరం కొంతమంది చిత్ర నిర్మాతలు తిరిగి షూటింగ్‌లను పారంభించడానికి అనుమతి కోరుతూ బోర్డును సంప్రదించినట్లు పేర్కొన్నారు. దీంతో బోర్డు కొన్ని మార్గదర్శకాలను విధిస్తూ షూటింగ్‌లకు అనమతించినట్లు తెలిపారు. (ఆ సినిమాలను బాయ్‌కాట్‌ చేయండి)

అవి.. ఇండోర్‌ షూటింగ్‌కు 15 మంది సిబ్బంది మాత్రమే పాల్గొనాలని, అవుట్‌ డోర్‌ షూటింగ్‌లకు 30 మంది పాల్గొనవచ్చని బోర్డు నిబంధనలు విధించిందని చెప్పారు. అంతేగాక షూటింగ్‌ సిబ్బంది తమ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని, షూటింగ్‌లో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడం, తరచూ శానిటైజర్‌ వాడటం, చేతులు కడుక్కుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపింది. ఇక సిబ్బందిలో ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపిస్తే వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, షూటింగ్‌ సమయంలో రద్దీకి అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసినట్లు మీనా వెల్లడించారు. అంతేగాక భోపాల్, గ్వాలియర్, మహేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, మధాయ్ (హోషంగాబాద్), ఖజురహో, పన్నా, జబల్పూర్‌లతో పాటు ఇండోర్‌లోని వివిధ ప్రదేశాలలో సుమారు 25 వెబ్ సిరీస్‌లు, సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వీడియోల షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బోర్డు ఆమె తెలిపారు. వాటిలో తమిళం, తెలుగు, బెంగాలీ చిత్రాలు, కనీసం ఐదు వెబ్ సిరీస్‌లు ఉన్నాయని మీనా తెలిపారు. (పాట్నాలో సుశాంత్‌ మెమోరియల్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు