కశ్మీర్, జార్ఖండ్‌లో నేడే చివరి పోలింగ్

20 Dec, 2014 03:11 IST|Sakshi

జమ్మూ/రాంచీ: జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ శాసనసభలకు ఐదు దశల ఎన్నికల్లో భాగంగా శనివారం చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. జమ్మూ కశ్మీర్‌లో 3 సరిహద్దు జిల్లాల్లోని 20 అసెంబ్లీ సీట్లకు జార్ఖండ్‌లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగనున్న ఐదవ దశ పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కశ్మీర్‌లో ఇప్పటివరకూ జరిగిన నాలుగుదశల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనందున, ఐదవ దశలో కూడా భారీగానే పోలింగ్ జరగవచ్చని భావిస్తున్నారు.

చివరిదశలో 18లక్షల మందికిపైగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 2,366 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లో శనివారం 16 సీట్లకు జరగనున్న పోలింగ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)నేత హేమంత్ సోరెన్, స్పీకర్ శశాంక్ శేఖర్ భోక్తా, రాష్ట్ర మంత్రి లోబిన్ హెంబ్రోమ్ తదితర ప్రముఖులు సహా 208 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
 

మరిన్ని వార్తలు